రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ యువకుడు మృతి

హైదరాబాద్ (CLiC2NEWS): రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు రాష్యా తరపున పోరాడుతూ మృతి చెందినట్లు సమాచారం. ఉద్యోగం కోసం నగరానికి చెందిన మహ్మద్ ఆష్సాన్ రష్యాకు వెళ్లాడు. అతనిని బలవంతంగా రష్యా ఆర్మీలో చేర్చడం వలన పోరాడుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. అతనితో పాటు నగరానికి చెందిన మరో ఇద్దరు యువకులు ఉద్యోగాల కోసం రష్యా వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయినట్లు సమాచారం.
హైదరాబాద్‌కు చెందిన ముగ్గరు యువకులను తిరిగి తీసుకురావాలని జనవరి నెలలో హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసి మాస్కోలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ కూడా రాశారు. మనదేశం నుండి రష్యా సైనిక సిబ్బందికి సహాయకులుగా పనిచేస్తున్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించిన కొద్ది రోజుల్లోనే ఆఫ్సాన్ మృతి కలిచివేస్తోంది. ఉద్యోగాల కోసం వెళ్లి మోసపోయిన యువకుల్ని తిరిగి స్వేదేశానికి తీసుకురావాలని మాజి మంత్రి కెటిఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు.