ఒక్కసారిగా 4 సిలిండర్‌లు పేలి భారీ అగ్నిప్రమాదం..

నెల్లూరు (CLiC2NEWS): ఒకే సారి నాలుగు సిలిండర్‌లు పేలి బర్మాషెల్ గుంటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సిలిండర్‌లు ఒకేసారి పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 4 పూరిళ్లు దగ్ధమయ్యాయి. దివ్యాంగురాలైన ఓ యువతి మృతి చెందినట్లు సమాచారం.