నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యార్థి ఆత్మహత్య..!
![](https://clic2news.com/wp-content/uploads/2021/01/dead-body.jpg)
నిజామాబాద్ (CLiC2NEWS): ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబిబియస్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి వసతి గృహంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం చింతగూడకు చెందిన హర్హ నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో ఎంబిబియస్ చుదువుతున్నాడు. శనివారం ఉదయం తన స్నేహితులు వసతి గృహానికి వచ్చి చూడగా హర్హ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు తెలిపారు. హర్ష తెలివైన విద్యార్థి అని.. అతని మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపినట్లు సమాచారం. హర్ష ఎందుకు ఆత్మహత్య చేసుకున్నడనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.