ఉపాసన కీలక నిర్ణయం.. ముందుగా పిఠాపురం నుండే..
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ నటుడు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన.. అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి మనుమరాలు అన్న విషయం తెలిసిందే. తన తాత ప్రతాప్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు ఉపాసన కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా శిశు సంక్షేమానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి ఓ నూతన కార్యక్రమాన్ని ముందుగా పిఠాపురం నుండి ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. ప్రసూతి, శిశు మరణాలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం అనంతరం మహిళలకు , చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, మహిళా సాధికారతపై అవగాహన కల్పించడం లాంటివి ఈ ప్రాజెక్టులో భాగాలు. ఇది ప్రారంభం మాత్రమేనని.. త్వరలో 109 అంగన్వాడీ భవనాలను పునరుద్ధరిస్తామని తెలియజేశారు.