ఎన్టిఆర్ జిల్లాలో దారుణం.. వీధికుక్కల దాడిలో బాలుడు మృతి
విజయవాడ (CLiC2NEWS): ఎన్టిఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో దారుణం చోటుచేసుకుంది. వీధికుక్కల దాడిలో ఏడాది వయస్సున్న చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక తుపాన్ కాలనీలో బాలతోటి గోపాలరావు, నాగమణి దంపతులు నివసిస్తున్నారు. వారికి ప్రేమ్‌కుమార్ ఏకైక సంతానం . బాలుడికి స్నానం చేయించేందుకు బయటకు తీసుకొచ్చి.. ఆమె పనిమీద లోపలికి వెళ్లింది. ఇంతలో కుక్కలు బాలుడిపై దాడిచేసి బయటకు లాక్కొనిపోయాయి. బయటకు వచ్చిన బాలుడి తల్లి , చిన్నారి కోసం రోడ్డుపై వెతకగా.. దూరంగా కుక్కల గుంపును స్థానికుడు ఒకరు తరిమేశాడు. తీవ్రంగా గాయాలైన చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆ చిన్నారి మృతి చెందాడు. పెళ్లయిన పన్నెండేళ్లకు ఆదంపతులకు పుట్టిన కుమారుడు మృత్యువాత పడటంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.