వ్య‌క్తిని కిడ్నాప్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ కేసులో న‌లుగురి అరెస్టు…

తిరుప‌తి (CLiC2NEWS): తిరుప‌తిలో సంచ‌ల‌నం రేపిన కిడ్నాప్ కేసును ఆంధ్ర‌ప‌దేశ్ పోలీసులు ఛేదించారు. వివ‌రాల్లోకి వ‌ళ్తే… జులై 24 (బుధ‌వారం)వ తేదీన చిన్న‌గొట్ట‌ల్లు మండ‌లం చెరువుమంద‌ర‌ప‌ల్లిలో భాస్క‌ర్ అనే వ్య‌క్తి కిడ్నాప్ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఈ క్ర‌మంలో భాస్క‌ర్ కుమారుడు రెడ్డి కిర‌ణ్ ను కిడ్నాప‌ర్లు రూ. 2 కోట్లు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు పోలీసుల‌కు కిర‌ణ్ ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు.. న‌లుగురు నిందితుల‌ను భాకరాపేట వ‌ద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి డ‌మ్మీ పిస్ట‌ల్‌, మత్తు సిరంజిలు స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుల్లో మ‌రో ఇద్ద‌రు ప‌రారీలో ఉన్న‌ట్లు ఎస్పీ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.