కేర‌ళ‌ వ‌రుస పేలుళ్ల ఘ‌ట‌న‌లో లొంగిపోయిన వ్య‌క్తి..

తిరువ‌నంత‌పురం (CLiC2NEWS): కేర‌ళ‌లోని క‌ల‌మ‌స్సేరిలోని జ‌మ్రా ఇంట‌ర్నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో వరుస బాంబు పేలుళ్ల ఘ‌ట‌న అంద‌రినీ దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ ఘ‌ట‌న‌కు బాద్యుడైన డొమినిక్ మార్టిన్ అనే వ్య‌క్తి పోలీసుల‌కు లొంగిపోయాడు. తానే ఈ బాంబు పేలుళ్ల‌కు పూర్తి బాధ్య‌త వ‌హిస్తున్నాన‌ని ఫేస్బుక్‌లైవ్‌లో మాట్లాడి త్రిశూర్‌లోని పోలీసుల‌కు లొంగిపోయాడు. ఈ ఫేస్‌బుక్ వీడియో ట్విట‌ర్‌లో వైర‌ల్‌గా మారింది.

లొంగిపోయిన వ్య‌క్తి.. జ‌మ్రా ఇంట‌ర్నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో జాతి వ్యతిరేక కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్నాయని.. అది మానుకోవాల‌ని డొమినిక్ మార్టిన్ చాలాసార్లు చెప్పినా వినిపించుకోలేద‌ని బాంబు పెట్టాన‌ని చెప్పాడు. నాపేరు మార్టిన్. జెహోవా విట్‌నెస్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్నా క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో బాంబు పెట్టింది నేనే. అక్క‌డ జాతి వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్నాయని ఆరేళ్ల కింద‌టే గుర్తించాను. అది మార్చుకోవాల‌ని ఎన్నోసార్లు చెప్పినా .. వారు వినిపించుకోవ‌ట్లేదు. అలాంటి సంస్థ మ‌న‌దేశానికి అవ‌స‌రం లేదు. అందుకే బాంబు పెట్టాను. అది ఎంత విధ్యంసం సృష్టిస్తుందో తెలుసు. నేను పోలీసుల‌కు లొంగిపోతున్నాను. నేను ఎలా పేలుళ్లు ప్లాన్ చేసింది సోష‌ల్‌ మీడియాలో పోస్టుచేయ‌కూద‌డు. అలా చేయ‌డం చాలా ప్ర‌మాద‌క‌రం, అందుకే న‌చేయ‌టంలేద‌ని వీడియో పేర్కొన్నాడు.

పేలుళ్ల స‌మ‌యంలో క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ హాల్ లో దాదాపు 2,500 మంది ఉన్నారు. వ‌రుస‌గా రెండు,మూడు బాంబులు పేలిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక మ‌హిళ మృతి చెంద‌గా 40 మందికి పైగా గాయాల‌య్యాయి.

కేర‌ళ‌లోని ఓ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో పేలుళ్లు..

Leave A Reply

Your email address will not be published.