స్కూల్ ఆటోని ఢీకొట్టిన లారీ.. ఇద్దరు చిన్నారులు మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2022/09/ACCIDENT-AT-CHARLAPALLI.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని చర్లపల్లి జైలు సమీపంలో పాఠశాల విద్యార్థులను తీసుకొస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందాగా.. నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రగాయలైన చిన్నారులను ఇసిఎల్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఆటోడ్రైవర్‌కు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.