రాంగ్ రూట్‌లో వచ్చి కారును ఢీకొన్న స్కూల్ బస్సు.. ఆరుగురు మృతి

లఖ్‌నవూ (CLiC2NEWS): స్కూల్ బస్సు రాంగ్ రూట్‌లో వచ్చి.. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఢిల్లీ-మేరఠ్ హైవేపై చోటుచోసుకుంది. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఖాళీగా ఉన్న స్కూల్ బస్సును డ్రైవర్ దాదాపు 9 కిలో మీటర్లు.. ఘజీపుర్ నుండి రాంగ్ రూట్‌లో నడిపినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ – మీరఠ్ హైవేపై రాహుల్ విహార్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఎస్‌యువి కారును బలంగా ఢీకొంది. కారులోని మృత దేహాలను అద్దాలు కట్‌చేసి బయటకు తీసినట్లు వెల్లడించారు.
