మెదక్ జిల్లాలో డివైడర్ను ఢీకొన్న స్కూటీ.. ముగ్గరు మృతి

మెదక్ (CLiC2NEWS): జిల్లాలోని మనోహరాబాద్ మండలం కల్లకల్ వద్ద స్కూటీ డివైడర్ను ఢీకొట్టింది. స్కూటీ పై ఉన్న ఇద్దరు బాలికలు, బాలుడు ఓ మహిళ కింద పడిపోయారు. అదే సమయంలో వారిపై నుండి ఓ గుర్తు తెలియని వాహనం వెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. నలుగురు స్కూటీపై మేడ్చల్ నుండి తూప్రాన్ వైపు వెళుతున్నారు. వీరిలో ఓ బాలిక తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.