బావిలోకి దూకి సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ఖమ్మం (CLiC2NEWS): ఖమ్మం జిల్లాలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని వైరా మండంలం నారపునేనిపల్లి గ్రామానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ (22) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఆరునెలల కిందటే పెళ్లి జరిగింది. ఆమె భర్త కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగానే పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఆమెరికాలో ఉన్నారు. అనారోగ్య కారణాలతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.