నాయుడుపేటలో రూ.1700 కోట్లతో సోలార్ సెల్ ప్లాంటు..

హైదరాబాద్ (CLiC2NEWS): ఎపిలోని నాయుడుపేటలోని 169 ఎకరాల్లో సోలార్ సెల్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ప్రీమియర్ ఎనర్జీస్ తెలిపింది. ఇది పూర్తిగా దేశీయంగా జరగాలని కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొత్త ప్లాంటు ఉంటుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవి సలుజా పేర్కొన్నారు. మొత్తం 169 ఎకరాల్లో రూ.1700 కోట్ల పెట్టుబడితో 4 గిగా వాట్ల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. భూమి కేటాయింపు కోసం ఎపి ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని ఆయన వెల్లడించారు. తెలంగాణలోని సీతారాంపూర్‌లో 75 ఎకరాల్లో రూ.3వేల కోట్ల పెట్టుబడితో 4 గిగావాట్ల సోలార్ సెల్, 4 గిగావాట్ల సోలార్ మాడ్యూళ్ల ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటకు గత ఏడాది జనవరిలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
సోలార్ సెల్ ప్లాంటు నిర్మాణానికి భోగోళిక వికేంద్రీకరణ, ముడి సరుకుల దిగుమతికి ఓడరేవు దగ్గరగా ఉండటం వలనే నాయుడుపేటను ఎంచుకున్నట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు. దీంతో తమిళనాడులోని సోలార్ మాడ్యూల్ తయారీ దారులకు సెల్‌లు అందిచడం సులభవవుతుందన్నారు. 2026 జూన్ కల్లా కొత్త సోలార్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు.