ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు చెప్తూ.. త‌ర‌గ‌తి గ‌దిలో కుప్ప‌కూలిన విద్యార్థిని మృతి

నెల్లూరు (CLiC2NEWS): పాఠ‌శాల త‌ర‌గ‌తి గ‌దిలో మాస్టారు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిస్తున్న విద్యార్థిని.. అక్క‌డే ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయింది. ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించే స‌రికే మృతి చెందింద‌ని వైద్యులు తెలిపారు. జిల్లాలోని వింజ‌మూరులోని జెడ్ పి హెచ్ స్కూల్‌లో ఏడ‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థిని త‌ర‌గ‌తి గ‌దిలోనే ఒక్క‌సారిగా కుప్ప‌కూలి క‌న్నుమూసింది. హుటాహుటిన ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే మృతి చెందిన‌ద‌ని వైద్యులు ప్ర‌క‌టించారు. విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందిన‌ద‌ని ప్రాథ‌మికంగా చెబుతున్నారు. పోస్‌మార్టం రిపోర్ట్ వ‌స్తేనే గాని.. విద్యార్థి మృతికి గ‌ల కార‌ణం తెలుస్తుంద‌ని అన్నారు. మ‌రోవైపు విద్యార్థి మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది.

Leave A Reply

Your email address will not be published.