ఫ్లాట్‌ఫామ్., రైలు మ‌ధ్య చిక్కుకున్న విద్యార్థిని

విశాఖ‌ప‌ట్ట‌ణం (CLiC2NEWS): విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లా దువ్వాడ రైల్వే స్టేష‌న్‌లో రైలు, ఫ్లాట్‌ఫామ్‌కి మ‌ధ్య‌న చిక్కుకుని ఓ విద్య‌ర్థిని న‌ర‌క‌యాత‌న అనుభ‌వించింది. అన్న‌వ‌రానికి చెందిన శ‌శిక‌ళ అనే విద్యార్థి దువ్వాడ‌లోని ఒక క‌ళాశాల‌లో ఎం.సి.ఎ. ఫస్ట్ ఇయ‌ర్ చ‌దువుతోంది. కాలేజీకి వెళ్లే క్ర‌మంలో గుంటూరు-రాయ‌గ‌డ ఎక్స్‌ప్రెస్‌లో విద్యార్థిని దువ్వాడ చేరుకుంది. రైల్లే స్టేష‌న్‌లో రైలు దిగుతున్న క్ర‌మంలో ఫ్లాట్‌ఫామ్‌, రైలు మ‌ధ్య‌లో శ‌శిక‌ళ ఇరుక్కుపోయింది. ఆమె కాలు ప‌ట్టాల మ‌ధ్య ఇరుక్కుపోవ‌డం తో శ‌శిక‌ల తీవ్ర ఇబ్బందికి గురైంది.

వెంట‌నే స్పందించిన రైల్వే రెస్కూ సిబ్బంది ఫ్లాట్‌ఫామ్ క‌ట్ చేసి.. విద్యార్థిని బ‌య‌ట‌కు తీశారు. దాదాపు రెస్కూ సిబ్బంది గంట‌న్న‌ర‌పాటు శ్ర‌మించారు. అనంత‌రం చికిత్స కోసం విద్యార్థినిని స్థానికంగా ఉన్న కిమ్స్ ఐకాన్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న కార‌ణంగా రైలు గంట‌న్న‌ర ఆల‌స్యంగా బ‌య‌లుదేరింది.

Leave A Reply

Your email address will not be published.