పరీక్ష రాసే సమయంలో సహ విద్యార్థిపై కత్తితో దాడి చేసిన విద్యార్థి
రాజానగరం (CLiC2NEWS): పాఠశాలలో విద్యార్థులంతా పరీక్ష రాస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ మొదలైంది. వారిలో ఓవిద్యార్థి మరో విద్యార్థిని చాకుతో పొడిచేశాడు. ఇదంతా ఉపాధ్యాయులు ఎదురుగా ఉండగానే జరిగింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం హైస్కూల్లో చోటుచేసుకుంది. పాఠశాలలో తొమ్మిదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని మరో విద్యార్థి చాకుతో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన విద్యార్థి పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరిస్తున్నారు. వారిరువురు మధ్య ఘర్షణకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.