కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం..!
బాధితుడు హైదరాబాద్కు తరలింపు
కామారెడ్డి (CLiC2NEWS): కొవిడ్ తర్వాత ప్రపంచ దేశాలను వణికిస్తున్న మరో మహమ్మారి మంకీపాక్స్ ఇప్పటికే 70కిపైగా దేశాల్లో 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇటీవల భారత్లోకూడా మంకీపాక్స్ వెలుగు చూసిన విషయం తెలిసినదే. కువైట్ నుండి కామారెడ్డికి వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. జులై 6వ తేదీన కామారెడ్డికి వచ్చిన వ్యక్తికి 20వ తేదీన జ్వరం, 23వ తేదీన దద్దుర్లు రావడంతో మంకీ పాక్స్ లక్షణాలుగా అనుమానించి బాధితుడ్ని ఆదివారం హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఆదివారం ఢిల్లీలో మరో మంకీ పాక్స్ సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు మోత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి.