మాతా శిశు సంరక్షణకు.. మూడంచెల వ్యవస్థ

హైదరాబాద్ (CLiC2NEWS): మాతాశిశు రక్షణకు, ఆరోగ్యకరమైన సమాచారం కోసం మూడంచెల వ్యవస్థను ప్రభుత్వం చేపడుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి పేట్ల బురుజు ఆసుపత్రిలో నుండి రాష్ట్రవ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆస్పత్రులలో 56 టిఫా స్కానింగ్ మిషన్స్నున వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గర్భిణులు ఆరోగ్యంగా ఉండటానికి మానవీవ కోణంలో ఈ మూడంచెల వ్యవస్థను ప్రారంభించినట్లు తెలిపారు. గర్భవతులు ప్రసవానికి ముందు (ఎఎన్‌సి, 102 అమ్మ ఒడి వాహనాలు), ప్రసవ సమయంలో సేవలు (డెలివరీ, ఎంసిహెచ్ కేంద్రాలు, ఐసియు, ఎస్ ఎన్యు), ప్రసవం తర్వాత సేవలు (102 వాహనాలు, కెసిఆర్ కిట్స్, చైల్డ్ ఇమ్యునైజేషన్) వంటివి మూడంచెల వ్వస్థలో అందిస్తున్నట్లు తెలిపారు. వీటిలో తప్పనిసరిగా నాలుగు సార్లు ఎఎన్‌సి చెకప్స్ ఉంటాయి. అలాగే అల్ట్రాసౌండ్, స్కానింగ్ సేవలు సైతం ప్రస్తుతం అందిస్తున్నామని మంత్రి తెలిపారు.