ఏలూరు జిల్లాలో షిర్డీ- వైజాగ్ రైలుకు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

ఏలూరు (CLiC2NEWS): ఏలూరు జిల్లాలో షిర్డీ- వైజాగ్ రైలుకు తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. షిర్డీ నుంచి విశాఖ‌ప‌ట్నం వెళ్లున్న షిర్డీ రైలు ఇవాళ (శ‌నివారం) సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో ఏలూరు రైల్వే స్టేష‌న్ ఫ్లాట్ ఫా -2కి చేరుకుంది. కాగా ఆ స‌మ‌యంలో ఎస్ 2 , ఎస్ 3 బోగీల మ‌ధ్య ఉన్న క‌ప్లింగ్ విరిగిపోయి లింక్ తెగిపోయింది.  వెంట‌నే రైల్వే అప్ర‌మ‌త్త‌మైన  రైలును నిపివేశారు. దాంతో ఘోర ప్ర‌మాదం త‌ప్పింది.

రైల్వే సిబ్బంది క‌ప్లింగ్ విరిగిపోయిన బోగీని ప‌క్క‌కు తీసి ఆ స్థానంలో మ‌రో బోగీని ఏర్పాటు చేశారు.  అనంత‌రం రైలు రాత్రి 7.22 గంట‌ల త‌ర్వాత వైజాగ్ బ‌య‌లుదేరింది. ప్ర‌యాణికులంతా సుర‌క్షితంగా ఉన్నార‌ని రైల్వే అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.