ఛ‌త్తీస్‌గ‌డ్‌: 20అడుగుల లోయ‌లో ప‌డిపోయిన వాహ‌నం.. 17 మంది మృతి

రాయ్‌పుర్ (CLiC2NEWS): ఛ‌త్తీస్‌గ‌డ్‌లో దాదాపు 25 మంది వ‌ర‌కు ఉన్న వాహ‌నం లోయ‌లో ప‌డి ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 17 మంది ప్రాణాలు కో్ల్పోయారు. ఈ ఘ‌ట‌న సోమ‌వారం కావ‌ర్ధా ప్రాంతంలో  చోటుచోసుకుంది. స్థానికులు కొంద‌రు అడ‌వి నుండి తెండు ఆకుల‌ని సేక‌రించి పిక‌ప్ వాహ‌నంలో తిరిగి వ‌స్తుండ‌గా వాహ‌నం ప్ర‌మాదానికి గుర‌య్యింది. మృతుల‌లో ఎక్కువ మంది మ‌హిళ‌లే ఉన్న‌ట్లు స‌మాచారం. క్ష‌త గాత్రుల‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌మాదం గురించి తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి విజ‌య్ శ‌ర్మ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. బాధిత కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.