ఎపి సిఎం చంద్రబాబుకు నగరంలో ఘనస్వాగతం..

హైదరాబాద్ (CLiC2NEWS): ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. ఎపి సిఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి నగరానికి రాగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. రేపు సాయంత్రం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్న విషయం తెలిసిందే. దీనికోసం ప్రజాభవన్‌లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని చంద్రబాబు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోగా.. తెలంగాణ టిడిపి నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ అభిమానులు ర్యాలీగా ముందుకుసాగారు.