చిరంజీవి నివాసంలో జనసేనానికి ఘన స్వాగతం..

హైదరాబాద్ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సొంతం చేసుకున్న జనసేనాని పవన్‌కల్యాణ్ తొలిసారిగా చిరంజీవిని కలిశారు. గురువారం ఢిల్లీ నుండి తిరిగివచ్చిన పవన్‌కల్యాణ్ చిరంజీవి నివాసంకు చేరుకున్నారు. మెగా కుటుంబ సభ్యులందరూ ఆయనకు ఘనస్వాగతం పలికారు. పవన్‌కల్యాణ్ .. అన్నయ్యకు , తల్లి అంజనాదేవికి, వదిన సురేఖకు పాదాభివందనం చేశారు. చిరంజీవి తమ్ముడిని పూలమాలతో సత్కరించారు. అనంతరం కేక్‌ను కట్‌చేసి కుటుంబసభ్యులంతా సంతోషం వ్యక్తపరిచారు.