నాలుగేళ్ల తర్వాత సొంతూరికి రఘురామకృష్ణరాజు
![](https://clic2news.com/wp-content/uploads/2024/01/grand-welcone-to-mp.jpg)
రాజమహేంద్రవరం (CLiC2NEWS): నాలుగేళ్ల తర్వాత ఎంపి రఘురామ కృష్ణరాజు సొంతూరికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి విమానాశ్రయంలో అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఢిల్లీ నుండి నేరుగా రాజమండ్రి చేరుకుని అక్కడనుండి ర్యాలీగా భీమవరం బయలుదేరారు. తాను పండక్కి స్వస్థలానికి వెళ్లాలని.. రక్షణ కల్పించమని రఘురామకృష్ణరాజు ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో తనను సిఐడి అధికారులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని, మరోసారి అలా జరగకుండా రక్షణ కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎంపి రఘురామ మాట్లాడుతూ.. నాలుగేళ్లు అనంతరం సొంతూరికి వెళ్లడం సంతోషంగా ఉందని రఘురామ అన్నారు. మా నానమ్మ చనిపోయినపుడు కూడా ఊరు వెళ్లలేదని అన్నారు. జైల్లో ఉన్నపుడు చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్ సహకారం అందించారని.. సొంతవారెవరో, పరాయివారెవరో అర్దమవుతుందన్నారు.