లారీని ఢీకొన్న పెళ్లి జీపు.. ఆరుగురు మృతి

అమేథీ (CLiC2NEWS): ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఇవాళ (సోమ‌వారం) తెల్ల‌వారు జామున అమేథీ జిల్లా గౌరీ గంజ్ వ‌ద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ పెళ్లి జీపు అదుపుత‌ప్పి ఎద‌రుగా వ‌స్తున్న లారీని బ‌లంగా ఢీ కొన్న‌ది. ఈ ప్ర‌మాదంలో జీపులో ప్ర‌యాణిస్తున్న ఆరుగురు ఘ‌ట‌నా స్థ‌లంలోనే మృతిచెందారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు గ‌ట‌నా స్థలానికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. గాయ‌ప‌డిన వారి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. కాగా రాయ్‌బ‌రేటీలో ఓ వివాహ వేడుక‌కు హాజ‌రై తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో ఈ ప్ర‌మాదం చోటుచేస‌కుంది. ఈ ప్ర‌మాదంపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.