రాజస్థాన్‌లో భర్తపైనే భార్య పోటీ!

జైపూర్ (CLiC2NEWS): రాజకీయంలో ఏదైనా సాధ్యమే.. అంటూ.. ఏకంగా కట్టుకున్న భర్తపైనే పోటీకి దిగింది ఓ భార్య. ఈ ఘటన సర్వత్ర చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ ఎన్నికల్లో దంత రామ్‌గఢ్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తన భర్తపైనే పోటీకి దిగింది. ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్ పోటీలోకి దిగనుండగా.. అతని భార్య రీటా చౌదరి జననాయక్ జనతా పార్టీ నుంచి అభ్యర్థిగా రంగంలోకి దిగారు.
వీరేంద్ర సింగ్ కాంగ్రెస్ పిసిసి మాజీ అధ్యక్షుడు, ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నారాయణ్ సింగ్ కుమారుడు. ఇంత గొప్ప రాజకీయ కుటుంబంలో.. భర్తపైనే భార్య పోటీకి దిగనుండటం చర్చనీయంశంగా మారింది.
ఇక రీటా చౌదరి విషయానికి వస్తే 2018లో కాంగ్రెస్ తరఫున దాంతా రామ్‌గఢ్ టిక్కెట్ ఆశించినా దక్కలేదు. దాంతో రీటా జననాయక్ జనతా పార్టీ (జెజెపి)లో చేరి.. ఆ పార్టీకి రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలయ్యారు. దాంతో ప్రస్తుత ఎన్నికల్లో రామ్‌గఢ్ నియోజకవర్గంలో తమ అభ్యర్థిగా జెజెపి ప్రకటించింది.
ఈ పోటీపై రీటా మాట్లాడుతూ.. “ నిరోద్యోగ సమస్య, అభివృద్ధి.. తదితర సమస్యలను ఎన్నికల్లో ప్రచార అస్త్రాలు చేసుకుంటాను“ అని అమె ప్రకటించారు.
భర్తపై పోటీ విషయంలో మీడియా ప్రశ్నించగా.. కాంగ్రెస్‌లో ఆయనకు ఇంకా టిక్కెట్ ఖరారు కాలేదు.. కాబట్టి.. ఇప్పుడే ఆ విషయంపై మాట్లాడలేను అన్నారు.
మారోవైపు వీరేంద్ర సింగ్ మాత్రం ఈ ఎన్నికల్లో తనకు, తన భార్యకు మధ్య ప్రత్యక్ష పోరు ఉంటుందని తెలిపారు.