బంగ్లాదేశ్‌లో యువనటుడు, అతని తండ్రి దారుణ హత్య..!
ఢాకా (CLiC2NEWS): బంగ్లాదేశ్‌లో నిరసనలశెగ కొనసాగుతూంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. దేశ ప్రధానిని గద్దె దించినా చల్లారలేదు. ప్రభుత్వ మద్దతుదారులపై అల్లరిమూకలు హింసాకాండకు పాల్పడ్డాయి. అవామీలీగ్ మద్దతుదారులకు చెందిన ఓ హోటల్‌కు నిప్పుపెట్టారు. ఆ మంటల్లో 24 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యువనటుడు , అతని తండ్రిని అతికిరాతకంగా చంపేశారు. ఈ నటుడు 2021లో హసీనా తండ్రి షేక్ ముజిబర్ రెహమాన్ బయోపిక్‌లో నటించినట్లు సమాచారం.
హసీనా తండ్రి యుజిబర్ రెహమాన్ బయోపిక్‌ను బంగ్లాదేశ్‌కు చెందిన దర్శక నిర్మాత సలీమ్ ఖాన్ తెరకెక్కించారు. ఆ చిత్రంలో తన కుమారుడు శాంతో ఖాన్.. రెహమాన్ యుక్తవయసు పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభించింది.
సోమవారం హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన వార్తలు వెలువడగానే ఆందోళనకారులు నటుడు శాంతో ఖాన్ సహా సలీమ్‌లను లక్ష్యాంగా చేసుకున్నారు. ఈ వార్తలు తెలుసుకున్న తండ్రీ కొడుకులు అప్రమత్తమయి, తమ స్వగ్రామానికి వెళ్లడానికి ప్రయత్నించారు. మార్గమధ్యలో ఆందోళనకారులు వీరిని అడ్డుకుని కర్రలతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు ధ్రువీకరించినట్లు సమాచారం.
హోటల్‌కు నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. 24 మంది సజీవదహనం!