31 ఏళ్ల యువ‌కుడు గుండెపోటుతో మృతి

ఖ‌మ్మం (CLiC2NEWS): వ‌య‌స్సుతో సంబంధం లేకుండా యువ‌కులు సైతం గుండెపోటుకు గురౌతున్నారు. మారుతున్న జీవ‌న‌శైలి, నిద్ర‌లేమి ప్ర‌ధాన‌కార‌ణాలుగా క‌నిపిస్తున్నాయి. తాజాగా ఖ‌మ్మం జిల్లా బాలాపేట‌కు చెందిన మానుకొండ‌ శ్రీ‌ధ‌ర్ అనే యువ‌కుడు గుండెపోటుతో హ‌ఠాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు. వ్యాయామ అనంత‌రం ఇంటికి వ‌చ్చిన కాసేప‌టికే తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన శ్రీ‌ధ‌ర్‌ను కుటుంబ‌స‌భ్యులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో చేరిన కొంత‌సేప‌టికే మృతి చెందాడు. శ్రీ‌ధ‌ర్ తండ్రి గ‌తంలో కాంగ్రెస్ నాయ‌కుడిగా, ఖ‌మ్మం వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటి ఛైర్మ‌న్‌గా ప‌నిచేశారు.

ఇదే విధంగా ఆదివారం ఖ‌మ్మంలోని అల్లీపురంకి చెందిన గ‌రిక‌పాటి నాగ‌రాజు (33) కూడా గుండెపోటుతో మృతి చెందారు. ఎంతో భ‌విష్య‌త్తున్న ఇద్ద‌రు యువ‌కుల మృతితో వారి కుటుంబ స‌భ్యులు సోక‌స‌ముద్రంలో మునిగిపోయారు.

Leave A Reply

Your email address will not be published.