ప్రధాని నరేంద్ర మోడీ సభలో యువతి హల్‌చల్..
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రధానమంత్రి నరేంద్రమోడీ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ఎస్‌సి ఉపకులాల విశ్వరూప మహాసభలో పాల్గొన్నారు. మోడీ ప్రసంగిస్తున్న సమయంలో ఓ యువతి హల్‌చల్ చేసింది. ఎస్‌సి వర్గీకరణ అంశం పై ప్రధాని మాట్లాడుతుండగా సభలో ఉన్న ఓ యువతి ప్లడ్‌లైట్ స్తంభం ఎక్కింది. ఇది గమనించిన మోడి తల్లీ కిందకు దిగాలి. ఇది మంచిది కాదు. నేను మీతో ఉన్నాను, నేను నీ మాట వింటానన్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, నేను మీకోసమే వచ్చానన్నారు. మీరు మందకృష్ణ మాట వినాలని మోడీ యువతికి విజ్ఞప్తి చేశారు. అనంతరం కొంత సమయానికి యువతి స్తంభంపై నుండి కిందకు దిగింది. దీంతో అంతా ఊపరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మోడీ యథావిధిగా ప్రసంగం కొనసాగించారు.