హైదరాబాద్‌లో ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకిన యువతి

హైదరాబాద్ (CLiC2NEWS): రాజధానిలోని చిక్కడపల్లి హరినగర్‌లో ఐదు అంతస్తుల అపార్టు మెంటు పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం సమయంలో అపార్టు మెంటులోకి వచ్చిన యువతి ఐదో అంతస్తు టెర్రస్ పైకి చేరుకుంది. ఫోనులో మాట్లాడుతూ ఉన్నట్టుండి ఒక్కసారిగా కిందకు దూకడంతో ఘటనాస్థలిలోనే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.