ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు మరోసారి పొడిగింపు

న్యూఢిల్లీ (CLiC2NEWS): ఆధార్ కార్డులో వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్ర సర్కార్ గతంలో ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది.. ఈ క్రమంలో భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. మరో మారు వివరాలు అప్‌డేట్ చేసుకునేందుకు గడువు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉడాయ్ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ గడువును 2024 డిసెంబరు 14వ తేదీవరకు పెంచుతున్నట్లు పేర్కొంది.
సంబంధిత రుజువులు సమర్పించి పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఉచిత గడువు ముగిశాక గతంలోలాగే ఆధార్ కేంద్రాల్లో రూ. 50 చెల్లించి అప్‌డేట్ చేసుకోవచ్చు.