శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి ఆధార్ తప్పనిసరి

శ్రీశైలం (CLiC2NEWS): శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి ఆధార్ తప్పనిసరని ఆలయ ఈఓ స్పష్టంచేశారు. శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా తీసుకురావాలని తెలియజేశారు. విఐపి దర్శనానికి, అభిసేకం టికెట్లకు కూడా ఆధార్ తప్పనిసరన్నారు. టికెట్లు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిబంధన తీసుకొచ్చామని, దీనికి భక్తులందరూ సహకరించాలని కోరారు.