ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ విజ‌యం

ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజ‌ధాని ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. బుధ‌వారం వెలువ‌డిన ఫ‌లితాల్లో అధికార పార్టీ జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఢిల్లీలో మొత్తం 250 వార్లులు ఉండ‌గా మెజార్టీ మార్కు 126 ను దాటి ఆమ్ ఆద్మీ పార్టీ 129 స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. మ‌రో నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతోంది.

బిజెపి 101 స్థానాల‌ను గెలుచుకుంది. కాంగ్రెస్ 8 స్థానాల‌లో గెలుపొందింది. ఇత‌రు 4 స్థానాల‌ను కైవ‌సం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.