ఢిల్లీ సిఎంగా అతిశీ ప్రమాణ స్వీకారం

ఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిశీ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌నివాస్‌లో లెప్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా కొత్త సిఎంతో ప్రమాణం చేయించారు. మద్యం కుంభకోణం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన ఇటీవలే విడుదలై వచ్చి.. సిఎం పదవికి రాజీనామా చేశారు. తదుపరి సిఎంగా అతిశీ పేరును ప్రతిపాదించారు. దీనికి ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. తాజాగా ఆమె శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మాజి ముఖ్యమంత్రి కేజ్రివాల్ హాజరయ్యారు.