కేజ్రివాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 7 ఆప్ నేతల నిరాహాదీక్ష

ఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ అరెస్టుకు నిరసనగా ఏప్రిల్ 7న ఆమ్ ఆద్మీ నేతలు నిరాహారదీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు పార్టీ నేత, కేబినేట్ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేజ్రివాల్ అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరాహారదీక్షకు పిలుపునిచ్చారు. ప్రజలు ఇళ్లలోకాని, ఆఫీసుల్లో ఎక్కడైనా సామూహిత నిరాహా దీక్షల్లో పాల్గొనవచ్చని పిలుపునిచ్చారు. ఆప్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కేంద్రం అరెస్టులు చేస్తోందన్నారు. ఏప్రిల్ 7వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ ప్రభుత్వంలోని మంత్రులు, ఆప్ ఎంపిలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, ఆఫీసు బేరర్లు దీక్ష చేపట్టనున్నారని రాయ్ పేర్కొన్నారు.