ఆధార్ తరహాలో విద్యార్థులకు ‘ఆపార్’ కార్డు..

గుంటూరు (CLiC2NEWS): ఆధార్ కార్డు తరహాలో ఇక నుండి విద్యార్థులకు అపార్ కార్డులు రానున్నాయి. వన్ నేషన్-వన్ స్టూడెంట్ ఐటి పేరిట 12 అంకెలతో కూడిన కార్డును కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. విద్యార్థులకు సంబంధించి అకడమిక్ వివరాలన్నింటినీ దీనిలో పొందుపరుస్తారు. ప్రభుత్వ , ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల అకడమిక్ వివరాలతో పాటు వారి ధ్రవపత్రాలు డిజిటల్ రూపంలో పొందుపరుస్తూ కేంద్ర విద్యాశాఖ రూపకల్పన చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని విద్యార్థులకు అపార్ కార్డు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.