ఎపిలో నేటి నుంచి చెత్త పన్ను రద్దు: ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. ఇవాళ్టి నుండి రాష్ట్రంలో చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడా ఇవాళ్లి నుండి చెత్త పన్నును అధికారులు వసూలు చేయరాదని ఆదేశించారు. ఇవాళ మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో సిఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడారు.
మహాత్మా గాంధీ అహింసా సిద్దాంతంలో ముందుకు వెళ్లారని … బానిసత్వం వద్దు.. స్వాతంత్రమే ముద్దు అని నినదించారని అన్నారు.. 2014 అక్టోబరు 2న ప్రధాని మోడీ స్వచ్ఛభారత్‌కు శ్రీకారం చుట్టారని తెలిపారు.
ఎపిలో గత ప్రభుత్వం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని అన్నారు. రోడ్లపై 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త కుప్పలుగా పేరుకుపోయిందని.. సంవత్సరంలోపు మొత్తం చెత్తను శుభ్రం చేయించాలని పురపాలక మంత్రి నారాయణను ఆదేశంచాం అని పేర్కొన్నారు. 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం చేరుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛ సేవకు ముందు రావాలని సిఎం చంద్రబాబు కోరారు.