స్కాంద పురాణం- పంచారామాలు!

ఈరోజు స్కాంద పురాణంలో చెప్పబడిన పంచారామాలు ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. తారాకాసుర వధా ఘట్టం ఈ పంచారాలమాల ఆవిర్భావం గురించి తెలియజేస్తుంది. హిరణ్య కశ్యపుని కుమారుడు నీముచి, అతని కొడుకు తారకాసురుడనే రాక్షసుడు. అంటే హిరణ్యకశ్యపునికి మనవడన్నమాట. అతడు పరమశివుని గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మ లింగాన్ని వరంగా పొందుతాడు.అంతే కాకుండా ఒక అర్చకుడు (బాలుడి) చేతిలో తప్ప ఇతరులెవ్వరి వల్లనూ తనకు మరణం లేకుండా వరం పొందుతాడు. బాలుడు తననేం చేయలేడని ఆ రాక్షసుడు ధీమాగా ఉండెను. ఇక పరమశివుని వరగర్వముచే దేవతలను బాధిస్తూ ఉండసాగెను. బాధలను తాళలేక పరమేశ్వర రక్షితుడైన తారకాసురుడు అమిత పరాక్రమశాలి అని, వారతనిని ఎదుర్కోలేమని అర్ధమైంది. తారకుడిని సామాన్య బాలకులెవ్వరూ గెలవడం అసాధ్యమని గుర్తించిన దేవతలు పార్వతీ పరమేశ్వరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడిని ప్రసాదించమని ప్రార్ధించారు. దేవతల కోరికమేరకు కుమారస్వామి ఉదయించాడు. దేవతలకు సేనాని అయిన కుమారస్వామి తారకాసురుని సంహరించాడు.
తారకాసురుడు నేలకూలడంతో అతని యందున్న ఆత్మలింగం ఐదు ఖండాలుగా మారింది. దేవతలు ఆ ఐదు లింగ శకలాలను ఐదు చోట్ల ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అవే పంచారామాలుగా ప్రసిద్ధికెక్కినవి.
-పూర్ణిమా
అడ్వకేట్
మరిన్ని `ఒక్కమాట`ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: పంచారామాలు