రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా..
పట్టుబడిన ఆసుపత్రి సూపరింటెండెంట్
![](https://clic2news.com/wp-content/uploads/2024/02/ACB-raided-the-superintendent-of-the-government-hospital.jpg)
నల్గొండ (CLiC2NEWS): నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. ఔషధాల టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుండి ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు సమాచారం. సూపరింటెండెంట్ లచ్చునాయక్ నివాసంలో వెంకన్న నుండి డబ్బు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. వెంకన్న ఆసుపత్రికి రెండేళ్లుగా మందుల సరఫరా చేస్తున్నారు. కొంత కాలంగా సూపరింటెండెంట్ 10 శాతం కమీషన్ తీసుకుంటున్నారని.. ఇటీవల అధిక శాతం కావాలని డిమాండ్ చేసినట్లు వెంకన్న తెలిపారు. నెల రోజుల క్రితం రూ. లక్ష ఇచ్చారు. మరో మూడు లక్షలు డిమాండ్ చేయగా ఎసిబిని ఆశ్రయించినట్లు సమాచారం.