అనంతపురం: లారీని ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి

శింగనమల (CLiC2NEWS): కారు టైరు పగిలి లారీని ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ రోడ్డ్ వద్ద జరిగింది ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారంతా అనంతపురానికి చెందినవారుగా గుర్తించారు. తాడిపత్రిలో నగర కీర్తన వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వారి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.