కంటైనర్ లారీ కిందకు దూసుకెళ్లిన ఆటో.. ఆరుగురు మృతి

మద్నూరు (CLiC2NEWS): కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని మద్నూరు మండలం మేనూరులోని జాతీయ రహదారిపై కంటైనర్ లారీ కిందకు ఆటో దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కంటైనర్ లారీ డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. మద్నూరు నుండి వస్తున్న ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ కిందకు దూసుకెళ్లింది. మరణించిన వారిలో మేనూరుకు చెందిన కృష్ణ, షేక్ అశ్వాక్, బోధన్ మహాజన్ లను పోలీసులు గుర్తించారు.