సింగ‌రేణి కార్మికుల‌కు ఇక‌నుండి ప్ర‌మాద బీమా రూ. 40ల‌క్ష‌లు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేత‌న ఖ‌తా ఉన్న సింగ‌రేణి కార్మికుల‌కు రూ. 40 లక్ష‌ల ప్ర‌మా బీమా సౌక‌ర్యం క‌ల్పించ‌నున్నారు. హైద‌రాబాద్ ఎస్‌బిఐ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఎస్‌బిఐ చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అమిత్ జింగ్రాన్ , సింగ‌రేణి సంచాల‌కుడు ఎన్‌. బ‌ల‌రామ్ స‌మ‌క్షంలో ఇరు సంస్థ‌ల ఉన్న‌తాధికారులు ఒప్పందాల‌పై సంత‌కాలు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న ప్ర‌మాద బీమా రూ. 20 ల‌క్ష‌లు ఉండ‌గా రూ. 40 ల‌క్ష‌ల‌కు పెంచిన‌ట్లు ఈ ఒప్పందంలో పేర్కొన్నారు. సింగ‌రేణి కార్మికుల‌కు ల‌బ్ధి చేకూరే ప‌లు రాయితీల‌ను కూడా ఇందులో క‌ల్పించారు. ఈ కొత్త ఒప్పందం మార్చి 4వ తేదీ నుండి అమ‌లులోకి రానున్న‌ది.

Leave A Reply

Your email address will not be published.