Mahabubabad Dist Court: బాలుడి హ‌త్య‌కేసులో నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష

మ‌హ‌బూబాబాద్ (CLiC2NEWS): జిల్లాకోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. మూడేళ్ల క్రితం బాలుడిని హ‌త్య‌చేసిన నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష విధిస్తూ న్యాయ‌స్థానం తీర్పువెలువ‌రించింది. 2020 అక్టోబ‌ర్ 18వ తేదీన మ‌హ‌బూబాబాద్‌లోని కృష్ణాకాల‌నీకి చెందిన దీక్షిత్ రెడ్డి అప‌హ‌ర‌ణ‌కు గురైయ్యాడు. సాగ‌ర్ అనే వ్య‌క్తి ఆ బాలుడిని కిడ్నాప్ చేసి.. అనంత‌రం హ‌త్య‌చేశాడు. డ‌బ్బుకోస‌మే నిందితుడు బాలుడిని హ‌త్య చేసిన‌ట్లు పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. ఈ కేసుపై విచార‌ణ చేప‌ట్టిన జిల్లా కోర్టు నిందితుడికి మ‌ర‌ణ శిక్ష విధించింది.

Leave A Reply

Your email address will not be published.