2002 గోద్రా రైలు దహనం కేసులో నిందితుడికి జీవిత ఖైదు
గోద్రాలో రైలు బోగీలకు నిప్పు పెట్టి 59 మంది కరసేవకుల మరణానికి కారణమైన కేసులో నిందితుడు రఫీక్ భతూక్‌కు జీవిత ఖైదు విధించారు. ఈమేరకు పంచమహల్ జిల్లాలోని గోద్రా అదనపు సెషన్స్ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. రఫీక్‌ను 2021లో అరెస్టు చేశారు. అనంతరం అతడిపై విచారణను వేగవంతం చేశారు. గోద్రా స్టేషన్‌లో దుండగులు ఆయోధ్య నుండి కరసేవకులతో తిరిగి వస్తున్న రైలుకు నిప్పుపెట్టారు. ఈ కేసులో రఫీక్ నిందితుడు. ఈ ఘటనలో సుమారు 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఇప్పటి వరకు న్యాయస్థానం 35 మంది నిందితులకు శిక్ష విధించింది. వారిలో 11 మందికి మరణ శిక్ష విధించగా.. 20 మందికి జీవిత ఖైదు విధించారు. 2016లో 11 మరణ శిక్షలను గుజరాత్ హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. ఆ తర్వాత ఈ కేసులో మరో ముగ్గురికి జీవిత ఖైదు విధించారు.
పంచమహాల్‌కు చెందిన ప్రత్యేక ఆపరేషన్ల గ్రూప్ పోలీసులు గతేడాది ఫిబ్రవరిలో రఫీక్‌ను గోద్రాలో అరెస్టు చేశారు. 2002లో దైలు దహనం తర్వాత రఫీక్ పేరు బయటకు రావడంతో అతడు గోద్రాను వదిలి పారిపోయాడు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో దాక్కొని గతేడాది తిరిగి గోద్రాకు వచ్చాడు.