రేపు సిబిఐ కోర్టు ముందు వివేకా హ‌త్య కేసు నిందితులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసు ద‌ర్యాప్తు క‌డ‌ప నుండి హైద‌రాబాద్ సిబిఐ ప్ర‌త్యేక కోర్టుకు బ‌దిలీ అయిన విష‌యం తెలిసిన‌దే. ఈ నేప‌థ్యంలో కేసుకు సంబంధించిన నిందితులు ఐదుగురు తొలిసారిగా శుక్ర‌వారం సిబిఐ కోర్టు ముందు హాజ‌రుకానున్నారు. ఈ మేర‌కు వారికి వేర్వేరుగా స‌మ‌న్లు, వారెంట్లు జారీ అయిన‌ట్లు తెలుస్తోంది.
క‌డ‌ప కేంద్ర జైలులో ఉన్న ముగ్గురు నిందితులు, బెయిల్‌పై ఉన్న మ‌రో ఇద్ద‌రు రేపు ఉద‌యం 10.30 గంట‌ల‌కు హైద‌రాబాద్ సిబిఐ కోర్టు ముందు హాజ‌రుకానున్నారు. వీరంతా గురువారం హైద‌రాబాద్‌కు చేరుకోనున్నారు.

Leave A Reply

Your email address will not be published.