చిరు, చ‌ర‌ణ్.. నెట్టింట్లో `ఆచార్య` స్టిల్ చ‌క్క‌ర్లు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న ఆచార్య  చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో రాంచ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్స్ లో న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో 2 పాట‌లు మిన‌హా షూటింగ్ పూర్త‌యింది. ఈ విష‌యాన్ని బిఎ రాజు టీం ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేసింది.

అట‌వీలోకేష‌న్‌లో చిరంజీవి, రాంచ‌ర‌ణ్ ప‌క్క‌ప‌క్క‌నే కూర్చున్న స్టిల్ ను ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. కామ్రేడ్ గెట‌ప్స్‌లో చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ ఓ వాగు ఒడ్డున రాయిపై కూర్చున్న ఫొటో ఇంట‌ర్‌నెట్లో చెక్క‌ర్లు కొడుతోంది. ఆ స్టిల్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

కొణిదెల సురేఖ స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో సోనూసూద్‌, పోసాని కృష్ణ‌మురళి, త‌నికెళ్ల‌భ‌రణి, సంగీత‌, కిశోర్‌, రెజీనా క‌సాండ్రా త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.