ప్రాణనష్టం లేకుండా చర్యలు చేపట్టాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
హైదరాబాద్ (CLiC2NEWS): భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు సిఎస్ శనివారం జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరుసగా రెండు రోజులు సెలవులు వస్తున్నందున.. అధికారులు సెలవులను ఉపయోగించకుండా పునరావాస కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. రహదారులు, వంతెనలు దెబ్బతిన్న మార్గాల్లో వాహనాల రాకపోకలను నిలిపి వేయాలని చెప్పారు. పోలీసు, నీటిపారుదల, రోడ్లు భవనాలు, విద్యుత్ , రెవెన్యూ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలన్నారు.
These are actually fantastic ideas in on the topic of blogging.
You have touched some pleasant things here.
Any way keep up wrinting.