కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్ల ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిపై చ‌ర్యలు..

హైదరాబాద్ (CLIC2NEWS): రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నంలో ఒక గంట వ్య‌వ‌ధిలో 34 మంది మ‌హిళ‌ల‌కు కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్లు చేసిన విష‌యం తెలిసిన‌దే. దీనిలో శ‌స్త్ర చికిత్స విక‌టించి న‌లుగురు మ‌హిళ‌లు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం క‌మిటీ నియ‌మించింది. ఈ క‌మిటీ నివేదిక‌ను ప్ర‌భుత్వానికి అందిస్తూ.. ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా సిఫార్సు చేసింది.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ప్ర‌భుత్వం 13 మందిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేసింది. ఈ కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్లు చేసిన డాక్ట‌ర్ జోయ‌ల్ సునీల్‌కుమార్‌పై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిపింది. రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ో స్వ‌రాజ్య‌ల‌క్ష్మి, డిసిహెచ్ ఎస్ ఝాన్సీల‌ను బ‌దిలీ చేసిన‌ట్లు స‌మాచారం. ఇలాంటి ద‌ర‌దృష్ట‌క‌ర‌మైన ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా క‌మిటీ ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.