ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు కలెక్టర్ ప్రసవం

ఖమ్మం (CLiC2NEWS): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకున్న అదనపు కలెక్టర్ స్నేహలత, ఆమె భర్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏఎస్పీ శబరీశ్‌లను తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అభినందించారు. మంత్రి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి స్నేహలతకు జన్మించిన చిన్నారిని ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
భార్యాభర్తలిద్దరూ ఉన్నతాధికారులైనా సామాన్యుల్లాగా సర్కార్ దవాఖానాలో ప్రసవం చేయించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.