పాఠశాలలో విద్యార్థులకు అదనపు వసతులు కల్పించాలి : సిఎం జగన్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అదనపు వసతులు కల్పించాలని సిఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో నాడు-నేడు వల్ల పెరిగిన విద్యార్థలకు అదనపు వసతులు, బోధనా సిబ్బంది ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. కొత్త్ విద్యావిధానం ప్రకారం కొన్ని పాలశాలల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాఠశాలలో సిబ్బంది నియమించాలని, అన్ని పాఠశాలలో సబ్జెక్టుల వారీగా బోదనా సిబ్బంది ఉండాలన్నారు. వీలైనంత త్వరగా మిగతా స్కూళ్ల మ్యాపింగ్ పూర్తిచేయాలని, ఆంగ్ల భాషా పరిజ్ఞనం కోసం యాప్స్‌ను బాగా వినియోగించుకోవాలని సూచించారు, జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పాఠశాలలను పర్యవేక్షించాలని, పిల్లలకు అందించే ఆహార నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని సిఎం జగన్ ఆదేశించారు.