శ్రీవారిని దర్శించుకున్న `ఆదిపురుష్` టీమ్
హైదరాబాద్ (CLiC2NEWS): తిరుమల శ్రీవారిని `ఆదిపురుష్` టీమ్ దర్శించుకున్నారు. ఇవాళ (మంగళవారం) తెల్లవారు జామున ప్రముఖ నటుడు ప్రభాస్ ఆదిపురుష్ టీం తో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపలంలో వేద పండితులు ప్రభాస్ తదితరులకు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇవాళ తిరుపతిలో ఆదిపురుష్ సినిమా ప్రీరిలీజ్ ఈ వెంట్ జరుగనుంది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ ప్రభృతులు పాల్గొననుండటంతో భారీగా అభిమానులు తిరుపతికి చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.