ITI: తెలంగాణ అర్‌టిసి కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ అర్‌టిసి ఐటిఐ కాలేజ్‌లు వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నాయి. వరంగల్, హైదరాబాద్ ఈ రెండు నగరాలలో ఉన్న కళాశాలల్లో మోటార్ మెకానిక్ వెహికల్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఐటిఐ కళాశాలలను ఆర్‌టిసి ఏర్పాటు చేసింది. నిపుణులైన అధ్యాపకులతో పాటు ఆర్‌టిసి అధికారులతో తరగతులను నిర్వహిస్తుంది. మోటార్ మెకానిక్ వెహికల్, డీజిల్ మెకానిక్ ట్రేడ్‌లకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వెల్డర్, పెయింటర్ ట్రేడ్‌లక ఎనిమిదో తరగతి విద్యార్హతగా నిర్ణయించారు. ఈ మేరకు టిజిఆర్‌టిసి ఎండి సజ్జనార్ వెల్లడించారు. దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు హైదరాబాద్ ఫోన్ నంబర్లు 9100664452, 040-23450033 , వరంగల్ ఐటిఐ కాలేజి ఫోన్ నంబర్లు 9849425313, 8008136611 ను సంప్రదించగలరు.